
ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ జరుగుతోంది. మాజీ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడుతూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ లీగ్ లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇండియా, పాకిస్థాన్ జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి. అయితే డబ్ల్యూసీఎల్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. దాయాధి జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్‌లో ఇప్పటికే జరగాల్సిన మ్యాచ్ లీగ్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.
లీగ్ మ్యాచ్ కావడంతో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు చేయవచ్చు. అయితే ఈ రెండు జట్లు ఫైనల్ కు వస్తే ఆడతాయా అనే ప్రశ్నకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు. పాక్ ఫైనల్ కు వస్తే వారితో మ్యాచ్ ఆడడానికి నేను సిద్ధంగా లేను అని ధావన్ చెప్పాడు. శనివారం (జూలై 26) డబ్ల్యూసీఎల్ మ్యాచ్ తర్వాత సెమీఫైనల్లో భారతదేశం, పాకిస్తాన్ తలపడే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ సెమీస్ కు వస్తే మీ వైఖరి మార్చుకుంటారు అని ధావన్ ను విలేకరి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై ధావన్ చిరాకు పడుతూ కనిపించాడు.
కోపంగా ధావన్ స్పందిస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.. "మీరు ఈ ప్రశ్నను తప్పు సమయంలో, తప్పు ప్రదేశంలో అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఈ ప్రశ్న అడగకూడదు. నేను ఇంతకు ముందు ఆడలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆడను". అని ధావన్ విలేకరితో అన్నాడు. ధావన్ సమాధానం వీడియో సోషల్ మీడియాలో కొద్దిసేపటికే వైరల్ అయింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు గత వారం పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. మొత్తానికి పాక్, భారత్ జట్లు నాకౌట్ కు వస్తే ఆడతాయో లేదో చూడాలి.
Reporter 🗣️ - If Pakistan reaches WCL Semi Final, will India Play ?
— Richard Kettleborough (@RichKettle07) July 27, 2025
Shikhar Dhawan 🗣️ - That's the wrong question, If this happens, I won't be playing against Pakistan once again.
~ What's your take on this 🤔 pic.twitter.com/bj7iz6UhY8