ఎయిర్ పోర్టుకు లేట్..వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ మిస్

ఎయిర్ పోర్టుకు లేట్..వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ మిస్

విండీస్ విధ్వంసకర వీరుడు షిమ్రన్ హెట్ మెయిర్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న హెట్ మెయిర్..చివరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు. దీనికి కారణం ఎయిర్ పోర్టుకు సరైన సమయంలో రాకపోవడమే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో పాటు..టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు విండీస్ టీమ్ ఫ్టైట్ ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే హెట్ మెయర్ కొంత ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అవడంతో..అతని స్థానంలో షమారా బ్రూక్ ఫ్లైట్ ఎక్కేశాడు. 

ఈ నెల 5 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఆతిథ్య జట్టుతో విండీస్ టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల 16 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇందు కోసం విండీస్ టీమ్ జట్టును ప్రకటించింది. ఈ టీమ్లో హెట్ మెయిర్ కూడా స్థానం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో విండీస్ టీమ్ ఆస్ట్రేలియా వెళ్లేందుకు రెడీ అయింది. ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అప్పటికే కొద్దిగా లేట్ వస్తానని హెట్ మెయిర్ విండీస్ బోర్డు దగ్గర పర్మీషన్ తీసుకున్నాడు. దీంతో అతని కోసం ఫ్లైట్ ను విండీస్ బోర్డు రీ షెడ్యూల్ కూడా చేసింది. కానీ రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్ ను కూడా హెట్ మెయిర్ మిస్ చేసుకున్నాడు. హెట్ మెయిర్ రాకపోవడంతో..విండీస్ బోర్డు అతని స్థానంలో బ్రూక్స్ను ఎంపిక చేసింది. ఈ మేరకు విండీస్ బోర్డు ప్రకటించింది. 

టీ20 వరల్డ్ కప్ కోసం విండీస్ టీమ్: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పావెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్