షిరిడి 11 రోజుల ఆదాయం రూ.17.42 కోట్లు

షిరిడి 11 రోజుల ఆదాయం రూ.17.42 కోట్లు

షిరిడి: మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయానికి 11 రోజుల్లో రూ.17.42 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్టు శనివారం తెలిపింది. వరుస సెలవులు రావడంతో 8 లక్షల మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి ఈ నెల 2 వరకు 8.23 లక్షల మంది భక్తులు వచ్చారని ఆలయ సీఈవో దీపక్ ముగలికర్ చెప్పారు.

1,213.680 గ్రాముల బంగారం, 17,223 గ్రాముల వెండిని భక్తులు కానుకగా సమర్పించినట్లు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఆలయానికి రూ.14.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.