ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే ట్రీట్.. శివశంక‌రీ పాట పాడిన బాల‌య్య‌

ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే ట్రీట్.. శివశంక‌రీ పాట పాడిన బాల‌య్య‌

అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ తన 60వ పుట్టిన రోజు (జూన్ 10)సందర్భంగా ఒక అపురూపమైన పాటతో త‌న అభిమానుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అలరించారు . తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాటను బాలయ్య స్వయంగా పాడారు. పుట్టిన రోజు కానుకగా ఒకరోజు ముందే అనగా మంగ‌ళ‌వారం (జూన్ 9) సాయంత్రం 5 గంటల 03 నిమిషాలకు త‌న యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్‌బీకే ఫిల్మ్స్ ‌లో విడుదల చేశారు.

అప్పట్లో ఘంటసాల పాడిన శివ‌శంక‌రీ పాట ఓ రికార్డ్ ను సాధించింది. ఇప్ప‌టికీ కొన్ని సింగింగ్ టాలెం‌ట్ షో ఫైన‌ల్స్ లో ఈ పాట పాడి గెలిచిన వాళ్లున్నారు. అలాంటి పాట‌ను బాల‌య్య పాడటం అంటే మాములు విషయం కాదు. సంగీత సాధ‌న ‌చేసిన వాళ్లు కూడా ఇలాంటి పాటలను పాడేందుకు కొంత ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది బాలయ్య విజయవంతంగా పాడారు. నంద‌మూరి ఫ్యాన్స్ ఈ పాట విని ద‌టీజ్ బాల‌య్య అని పొగుడుతున్నారు . ప్ర‌స్తుతం ఈ పాట‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.