
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం (సెప్టెంబర్ 28) జరగబోయే ఆసియా కప్ ఫైనల్ పై భారీ హైప్ నెలకొంది. రెండు జట్లు తుది సమరానికి రావడంతో రెండు దేశాల మధ్య క్రికెట్ క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్, ఇండియా జట్లు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్నాయి. పాకిస్థాన్ ఇండియా మీద రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ లన్నీ గెలిచింది. మరోవైపు ఇండియా అపజయమే లేని జట్టుగా దూసుకెళ్తుంది. దుబాయ్ ఇంటార్ నేషనల్ స్టేడియంలో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ మాట్లాడాడు.
ఓక టీవీ షో లో చర్చిస్తూ అక్తర్.. పాకిస్థాన్ విజయావకాశాలు గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో అక్తర్ మాట్లాడిన మాటలు నవ్వు తెప్పించాయి. పాకిస్థాన్ ఫైనల్ గెలవాలంటే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేయాలని అనబోయి "అభిషేక్ బచ్చన్" ను త్వరగా ఔట్ చేయాలని నోరు జారాడు. పొరపాటు చేసిన అక్తర్ వ్యాఖ్యలకు అక్కడ ఉన్నవారు అందరూ నవ్వడం విశేషం. ఈ పాక్ మాజీ పేసర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా " అభిషేక్ బచ్చన్‌ను పాకిస్తాన్ ముందుగానే అవుట్ చేస్తే, మిడిల్ ఆర్డర్‌లో ఏమి జరుగుతుంది?". అని అక్తర్ పాకిస్తాన్ గేమ్ ప్లాన్‌ను వివరిస్తున్నాడు.
అక్తర్ మాటలను ప్యానెలిస్టులు వెంటనే సరిదిద్దారు. అతను అభిషేక్ శర్మ బదులుగా అభిషేక్ బచ్చన్ అన్నాడని చెబుతున్నారు. అక్తర్ మాటలకు నెటిజన్స్ ఆడేసుకుంటున్నాడు. తనకు మైండ్ పోయిందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ విషయానికి పాకిస్థాన్ పై లీగ్ దశలో ఒకసారి.. సూపర్-4లో మరొకసారి టీమిండియా ఘన విజయం సాధించి దాయాధి దేశంపై మరోసారి మరోసారి ఆధిపత్యం చూపించింది. గతంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాటిక్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. కానీ ప్రస్తుత పాకిస్థాన్ జట్టును చూసుకుంటే ఇండియాకు అసలు పోటీనే కాదని స్పష్టంగా అర్ధమవుతోంది.
ఇండియా– పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడితే టీమిండియా ఏకంగా12 సార్లు విజయం సాధించింది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు వారు రెండుసార్లు తలపెడితే రెండు సార్లు ఇండియానే గెలిచింది. ప్రస్తుతం ఆసియా కప్ లో రెండు జట్లు ఆసియా కప్ లో రెండు జట్లు ఫైనల్ కు వచ్చాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపిస్తుందా లేకపోతే పాకిస్థాన్ ఇండియాకు షాక్ ఇస్తుందా అనే విషయం చూడాలి.