
హైదరాబాద్ హోటళ్లకు ఏమైంది.. బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హైదరాబాద్ హోటళ్లలో తినాలంటే జనం జంకే పరిస్థితి దాపురించింది. ఇటీవల నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు కారణం. సిటీలో నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక హోటల్/ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక, చెట్నీలో ఈగ.. ఇలా ఫుడ్ లవర్స్ షాక్ అయ్యే వార్తలు చూస్తూనే ఉన్నాం.
ఈ ఘటనలతో గతంలో హైదరాబాద్ వంటకాల గురించి చెబితేనే నోరూరిన జనాలు ఇప్పుడు హోటళ్లను తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి నెలకొంది. మొన్న హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన మరువక ముందే తాజాగా నగర శివారులోని నానక్ రామ్ గూడలో ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. రాగి సంకటిలో బొద్దింక దర్శనమివ్వడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు.
►ALSO READ | పిల్లల పంచాయితీ .. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు ..పావుగంటలోనే మృతి
వివరాల ప్రకారం.. నానక్ రామ్ గూడాలోని కృతుంగ హోటల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాగి సంకటి ముద్దలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. సగం తిన్న తర్వాత ఈ విషయం గమనించిన కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రాగి సంకటిలో బొద్దింక రావడంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు కస్టమర్.
ఈ ఘటనతో కస్టమర్‌కు క్షమాపణ చెప్పి మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రిక్వెస్ట్ చేయాల్సిందిపోయి సదరు హోటల్ సిబ్బంది కస్టమర్‌కు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఓ వైపు తినే ఆహారంలో బొద్దింక రావడం.. మరోవైపు హోటల్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంతో చిర్రెత్తుకుపోయిన కస్టమర్ ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.