ఓం భీమ్ బుష్.. ఈ జాగా నాది.. మంత్రాలు, పసుపు, కుంకుమతో అర్ధరాత్రి వ్యక్తి హల్చల్

ఓం భీమ్ బుష్.. ఈ జాగా నాది.. మంత్రాలు, పసుపు, కుంకుమతో అర్ధరాత్రి వ్యక్తి హల్చల్
  • మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో ఘటన

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ పరిధిలోని మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి సృష్టించిన హంగామా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పీర్జాదిగూడ మాజీ కో-ఆప్షన్ మెంబర్ మనవడిగా చెబుతున్న సదరు వ్యక్తి ఒక ప్లాట్ వద్దకు వచ్చి ‘ఓం భీం బుష్.. ఈ జాగా నాది’ అంటూ గట్టిగా కేకలు వేశారు. 

క్షుద్రపూజల తరహాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు విసిరి కలకలం రేపాడు. రాజకీయ పలుకుబడితోనే అతను ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని కాలనీవాసులు ఆరోపించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.