మూసాపేట, వెలుగు : కరెంట్ సరఫరాలో తేడాతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇండ్లల్లోని వైఫై రూట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటన కూకట్ పల్లిలోని వివేకానందనగర్ కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానందనగర్ కాలనీలో కొంతకాలంగా కరెంట్ లో ఓల్టేజ్, హై ఓల్టేజ్‌తో హెచ్చుతగ్గులు వస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాలనీలో ఉండే చక్రధర్ ఇంట్లో ఇంటర్నెట్ వైపై రూటర్ స్విచ్ బాక్స్ ఒక్కసారిగా పేలిపోయింది.
వెంటనే ఇంట్లోని మిగతా వస్తువులకు మంటలు అంటుకుని కాలిపోయాయి. సమీపంలో ఉన్న మూడు ఇండ్లల్లోనూ ఇదే విధంగా రూటర్లు పేలి మంటలు చెలరేగినట్లు ఆయా ఇంటి ఓనర్లు తెలిపారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారన్నారు.

