V6 News

హైదరాబాదీలకు గుడ్ న్యూస్: స్లమ్ ఏరియాల్లో జీ3, జీ5 బిల్డింగులు..ప్రజల సమ్మతితో నిర్మాణం

హైదరాబాదీలకు గుడ్ న్యూస్: స్లమ్ ఏరియాల్లో జీ3, జీ5 బిల్డింగులు..ప్రజల సమ్మతితో నిర్మాణం
  • హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల సమ్మతితోనే నగరంలోని స్లమ్ ఏరియాల్లో జీ +3, జీ+5 బిల్డింగులు నిర్మించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో వివిధ డిపార్ట్​మెంట్ల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ.. బస్తీల్లో ఇండ్ల నిర్మాణం కోసం రెండు వారాల నుంచి 26 బృందాలు పని చేస్తున్నాయన్నారు.

ఇప్పటివరకు 4,800 మంది సొంత జాగా ఉన్నవాళ్లు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 85 శాతం పైగా వెరిఫికేషన్​పూర్తి చేసినట్టు చెప్పారు. మిగిలిన ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తామన్నారు. డబుల్​ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల పురోగతిని సమీక్షించారు. ప్యారడైస్ జంక్షన్ నుంచి శామీర్​పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు.

జిల్లా రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఆఫీసర్​శ్రీధర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్​రామకృష్ణ, పీడీ హౌసింగ్ అశోక్ చక్రవర్తి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అపర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ పరిమితి) శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్  రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.