అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో ఫేక్ పోలీస్ రీల్స్ చేయడం కలకలం రేపింది. పోలీస్ డ్రెస్ లో.. ఎలాంటి డౌట్ రాకుండా అచ్చం పోలీస్ లాగే సచివాలయం ప్రాంగణంలోకి ఎంటరైన వ్యక్తి.. తాను సీఎం పర్సనల్ సెక్రెటరీ అని.. ఎవరైనా కలవాలంటే మెసేజ్ చేయాల్సిందిగా వీడియో చేసి సోషల్ మీడియలో పెట్టాడు.
సచివాలయంలో రీల్స్ చేసిన ఫేక్ పోలీసుపై కేసు నమోదు చేశారు పోలీసులు. రీల్స్ చేసిన ఫేక్ పోలీసు నిఖిల్ కోసం గాలింపులు చేపట్టారు. పోలీసు యూనిఫాంతో సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్.. ఈ విషయంలో పోలీసుల దృష్టికి రావడంతో పరారైనట్లు తెలుస్తోంది.
గద్వాలకు చెందిన చెందిన నిఖిల్‌పై ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. వీడియో ఇన్ స్టాలో వైరల్ కావడం.. పోలీసులు కేసు నమోదు చేయడంతో రీల్ ను డిలీట్ చేశాడు. సైఫాబాద్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిఖిల్ గురించి గాలిస్తున్నారు.
సైఫాబాద్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిఖిల్ గురించి గాలిస్తున్నారు.
