ఖమ్మం టౌన్, వెలుగు: నూతనంగా జిల్లా కలెక్టర్ గా వచ్చిన దివాకరను మంగళవారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మ రాజేశ్వరరావు పర్యవేక్షణలో సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పూల మొక్కను బహూకరించి, శాలువాతో సత్కరించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ తో చర్చించారు. అంతకుముందు కలెక్టర్ ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు వచ్చే నెల 4న నిర్వహించనున్న జాబ్మేళా నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి సమీక్ష నిర్వహించారు.

