V6 News

అభివృద్ధి పనులకు ఫండ్స్ఇవ్వండి : ఎమ్మెల్యే కె.మదన్ మోహన్ రావు

అభివృద్ధి పనులకు ఫండ్స్ఇవ్వండి : ఎమ్మెల్యే కె.మదన్ మోహన్ రావు

కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరారు. మంగళవారం హైదరాబాద్​లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 

గత వానాకాలంలో వరదలకు కొట్టుకుపోయిన లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్డు సమీపంలోని బ్రిడ్జి, అడవి లింగాల బ్రిడ్జిల నిర్మాణానికి ఫండ్స్​కేటాయించాలని, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఫెండింగ్​బిల్స్​ఇవ్వాలని కోరారు. బ్రిడ్జిల నిర్మాణానికి తక్షణమే ఫండ్స్​మంజూరు చేయాలన్నారు. ఇందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే  తెలిపారు.