నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బాలికతో చెడు ప్రవర్తన.. నిందితుడికి 12 ఏండ్ల జైలు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బాలికతో చెడు ప్రవర్తన.. నిందితుడికి 12 ఏండ్ల జైలు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏడేండ్ల బాలిక పట్ల చెడుగా ప్రవర్తించిన నిందితుడికి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోక్సో కోర్టు 12 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్​నగరంలోని ఓ కాలనీకి చెందిన బింగి అంకుశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(40) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2020 మార్చి 20న ఏడేండ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన ఎదురింటి మహిళ కేకలు వేయడంతో పారిపోయాడు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కోర్టుకు చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సమర్పించారు. నేరపూరిత ప్రవర్తనతో బాలిక దుస్తులు విప్పిన నిందితుడు అంకుశ్​కు 12 ఏండ్ల కఠిన జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ధర్మవరపు వరూధిని తీర్పు వెలువరించారు.