కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ నోట్ రిలీజ్ చేసి ఆడియన్స్కి షాక్ ఇచ్చింది.
మొదట ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేస్తూ, జూన్ 4న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి వాయిదా వేస్తూ ఫ్యాన్స్ని డిస్సపాయింట్ చేశారు. అంతేకాకుండా మళ్ళీ రిలీజ్ ఎప్పుడన్నది కూడా చెప్పకుండా మరింత నిరాశపరిచారు.
మేకర్స్ విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన చేస్తూ.. “సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే గ్లోబల్ రిలీజ్‌ను టార్గెట్ చేస్తూ, ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్స్‌పై టీమ్ ఫోకస్ పెట్టింది. CinemaConలో వచ్చిన సూపర్ రెస్పాన్స్‌తో, ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని టీమ్ చెప్పింది.
ఈ క్రమంలోనే “కొన్ని సినిమాలు కేవలం తీస్తాం.. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనకి సినిమాపై ఉన్న ప్యాషన్‌ని గుర్తు చేస్తాయి. టాక్సిక్ అలాంటి స్పెషల్ జర్నీ” అని చెప్పి ఆడియన్స్ని హోల్డ్లో పెట్టారు.
— KVN Productions (@KvnProductions) April 29, 2026
భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా..
ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, లేడీ సూపర్ స్టార్ ,మలయాళ ముద్దుగుమ్మ హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

