రెండు కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ.. బీహార్ రాజధాని పాట్నాలో ఓ కోచింగ్ సెంటర్ పై కాల్పులు కలకలం రేపుతున్నాయి. రెండు కోచింగ్ సెంటర్ల మధ్య నెలకొన్న పోటీ ఈ కాల్పులకు దారి తీసింది. ఇటీవల ప్రకటించిన కాంపిటిటివ్ ఎగ్జామ్స్ లో ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ కు ఎక్కువ ర్యాంకులు వచ్చాయని మరో కోచింగ్ సెంటర్ కు చెందిన వారు దాడి చేసి సిబ్బందిని గాయపర్చారని.. అంతేకాదు కాల్పులు కూడా జరిపారని పాట్నాలోని ప్రముఖ ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం (జూన్ 2) పాట్నాలోని ముసల్లాపూర్ హాట్ సమీపంలో ఎడ్యుకేటర్ ఖాన్ కోచింగ్ పై దాడి జరిగింది. కొంత మంది గుంపు కోచింగ్ సెంటర్ పై దాడికి దిగినట్టు, సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు గాయపడ్డారని కోచింగ్ సెంటర్ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు లో కేవలం కొంతమంది గ్రూపు కోచింగ్ సెంటర్ పై దాడి చేసినట్లు నిర్ధారించారు.
ALSO READ : ఫర్జీ స్టయిల్ లో రోడ్లపై డబ్బు విసిరేస్తూ.. డ్రగ్ స్మగ్లర్లు బీభత్సం..
అయితే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వాదన మరోలా ఉంది. తమ సిబ్బంది పై భౌతిక దాడులే కాదు.. కాల్పులు కూడా జరిపారు. మా కోచింగ్ సెంటర్ లో వచ్చిన రిజల్ట్స్ ను చూసి ఓర్వ లేక ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కాల్పులు తెగబడ్డారు. మాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాల్పులకు సంబందించి ఎటువంటి ఆధారాలు ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు.
#WATCH | Patna, Bihar: SSP Kartikeya K Sharma says, "This is a case involving physical assault. It has been reported that the guard sustained injuries; therefore, further action is being taken by recording his statement as well as the statements of the local people. The injured… https://t.co/5fSeoroGWH pic.twitter.com/Qa5gxX1Nrx
— ANI (@ANI) June 2, 2026
