బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదా చెప్పాలి

బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదా చెప్పాలి
  • మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్: కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకుంటుందో లేదో బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మేం సూటిగా అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తెలంగాణ రైతులను మోసం చేసే రీతిలో బీజేపీ నాయకులు మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత మెతుకు ఆనంద్, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
ఈ సమావేశంలో మంత్రి జి.జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ ఏదో చెప్పాలని ఏదో చెప్ప బోయి మల్లో సారి తెలంగాణ రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. రెండు నెలలుగా వరి దాన్యం చర్చ నడుస్తుంటే బండి సంజయ్ రైతులను అవమానించే పద్దతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. వానాకాలం మొత్తం పంటను కేంద్రం తీస్కుకోవాలని మేము అడుగుతుంటే కేంద్ర మంత్రి యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పంట పండించక మాట్లాడుతాం అంటే ఎలా?  రేపు రైతు ఏ వరి నారుపోయాలి  ఇది ముందు చెప్పండి అని డిమాండ్ చేశారు.