సిరాజ్ బౌలింగ్ మెచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. "ఇపుడేం చేయాలంటూ"..

సిరాజ్ బౌలింగ్ మెచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. "ఇపుడేం చేయాలంటూ"..

"మహమ్మద్ సిరాజ్" ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తుంది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ ప్లేయర్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి లంక జట్టును ఎక్కడా కోలుకోనీకుండా చేసాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు వికెట్లు తీసిన మియా.. లంక 50 పరుగులకే ఆలౌట్ కావడంలో ప్రధాన పాత్ర పోషించి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. 

సిరాజ్.. ఇప్పుడేం చేయాలి
 
ఈ క్రమంలో  16 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి ఆ ప్రైజ్ మనీని శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్ కి ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ తెలుగు కుర్రాడిపై దేశమంతా ప్రశంసలు కురిపిస్తున్న వేళ.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సిరాజ్ కి ప్రత్యేక ట్వీట్ చేసింది. "సిరాజ్‌ను అడగండి, ఇంత ఖాళీ సమయంలో ఏమి చేయాలో" అని ట్వీట్ చేసింది.

శ్రద్ధా కపూర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఇన్నింగ్స్ గంటలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్.. 6 ఓవర్లోనే మ్యాచ్ ని ఫినిష్ చేసింది. సండే నైట్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న వారందరికీ సిరాజ్ ఊహించని షాకిచ్చాడు. మొత్తానికి సిరాజ్ తన బౌలింగ్ స్పెల్ తో బాలీవుడ్ బ్యూటీ మనసు దోచేశాడు.    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)