- కిలో మల్లెలు వెయ్యి, కనకాంబరాలు రూ.1,500
- గుడిమల్కాపూర్ లో ఫుల్ రష్
హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో పూల ధరలు చుక్కలనంటాయి. కొనుగోలుదారులతో సిటీలోని పలు మార్కెట్లు కిటకిటలాడాయి. పూలకు పేరుగాంచిన గుడిమల్కాపూర్ మార్కెట్ జనసంద్రాన్ని తలపించింది. సాధారణ రోజుల్లో ఇక్కడ కిలో మల్లెపూలు రూ.400 వరకు దొరికితే గురువారం రూ.వెయ్యికి పైనే అమ్మారు.
కనకాంబరాలు100 గ్రాములకు రూ.150, కిలో అయితే, రూ.1,500 పలికింది. చామంతులు సాధారణ రోజుల్లో కిలో రూ.70 నుంచి రూ.100 ఉంటే.. ఇప్పుడు కిలో రూ.300కు, ఎర్ర గులాబీలకు కిలో రూ.100 వరకు ఉంటే రూ.200 వరకు, బంతి పూలు రూ.50 వరకు ఉంటే రూ.100 వరకు విక్రయించారు. సాధారణ రోజుల్లో ఇక్కడికి రోజూ 150 నుంచి 250 క్వింటాళ్ల పూలు వస్తుంటాయిని, కానీ, శ్రావణ శుక్రవారం నేపథ్యంలో 400 నుంచి 600 క్వింటాళ్ల వరకు పూలు దిగుమతి చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
