Asia Cup 2025: అలాంటి ఆశ లేదు.. కనీసం ఇండియా స్క్వాడ్‌లో చోటివ్వండి: స్టార్ క్రికెటర్ తండ్రి ఆవేదన

Asia Cup 2025: అలాంటి ఆశ లేదు.. కనీసం ఇండియా స్క్వాడ్‌లో చోటివ్వండి: స్టార్ క్రికెటర్ తండ్రి ఆవేదన

ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ లో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కపోవడం దురదృష్టకరం. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై చాలానే విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2025 సీజన్ లోపంజాబ్ కింగ్స్ తరపున 600 పైగా పరుగులు చేయడంతో కెప్టెన్సీలో సత్తా చాటి జట్టును ఫైనల్ కు చేర్చాడు. మిడిల్ ఆర్డర్ లో అత్యంత ప్రమాదకర బ్యాటర్. అయినప్పటికీ అయ్యర్ కు 15 మంది స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకును పక్కన పెట్టినందుకు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

శ్రేయాస్ అయ్యర్ తండ్రి మాట్లాడుతూ.." శ్రేయస్ భారత టీ20 జట్టులోకి రావడానికి ఇంకా ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ నుండి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున నిలకడగా రాణించాడు. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రతి ఏడాది బెటర్ గా ఆడుతున్నాడు. 2024లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఈ ఏడాది పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు. 

►ALSO READ | Rohit Sharma: రిటైర్మెంట్ రూమర్స్‪కు చెక్.. ఆసీస్ కుర్రాళ్లతో మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్

నేను అతన్ని ఇండియా కెప్టెన్‌గా చేయమని చెప్పడం లేదు. కనీసం జట్టులోకి అయినా అతన్ని ఎంపిక చేసుకోండి. జట్టు నుండి తొలగించినా.. అయ్యర్ తన ముఖంలో నిరాశ చూపించడు. ఇది తన అదృష్టమని.. అందుకు మనం ఏమీ చేయలేమని అంటాడు. ఎల్లప్పుడూ కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు. శ్రేయాస్ ఎవరినీ నిందించడు కానీ లోపల సహజంగానే నిరాశ ఉంటుంది". అని అయ్యర్ తండ్రి తన అసంతృప్తి తెలిపాడు. 

శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన చీఫ్ సెలెక్టర్ అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎవరి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతను భర్తీ చేస్తాడో చెప్పాలని ఎదురు ప్రశ్నించాడు. ‘ఎవరి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకోవాలి. ఇందులో అతని తప్పు లేదు. మా తప్పు కూడా లేదు. ప్రస్తుతానికి 15 మందిని ఎంపిక చేయాలి. జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లను తీసుకున్నాం. కాబట్టి అవకాశం కోసం శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేచి చూడాల్సిందే’ అని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు.