Rohit Sharma: రిటైర్మెంట్ రూమర్స్‪కు చెక్.. ఆసీస్ కుర్రాళ్లతో మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్

Rohit Sharma: రిటైర్మెంట్ రూమర్స్‪కు చెక్.. ఆసీస్ కుర్రాళ్లతో మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై గత కొంతకాలంగా రిటైర్మెంట్ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత హిట్ మ్యాన్ కెరీర్ సందిగ్ధంలో పడింది. వయసు మీద పడడం, ఫిట్ నెస్ సమస్యలు లాంటి విషయాలు రోహిత్ వన్డే కెరీర్ ను అయోమయంలో పడేశాయి. కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ ఆడుతున్న రోహిత్ కెప్టెన్సీ సంగతి పక్కనపెడితే జట్టులో కొనసాగుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వన్డేల్లో కెప్టెన్ గా బ్యాటర్ గా అద్భుతమైన రికార్డ్ ఉన్నా తాను పెట్టుకున్న 2027 వరల్డ్ కప్ టార్గెయే ను రీచ్ అయ్యేలా కనిపించడం లేదు. 

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇటీవలే బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలు పెట్టిన హిట్ మ్యాన్.. తాజాగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో వన్డేలను ఆడడానికి ఆసక్తి చూపించినట్టు సమాచారం. టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో కనిపించనున్నారు. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్ లు ఆడనుంది. 

►ALSO READ | Ajinkya Rahane: ముంబైకి బిగ్ షాక్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్సీకి రహానే గుడ్ బై

సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్య కాన్పూర్‌ వేదికగా మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ రోహిత్  శర్మ కెరీర్ లో చివరిదని రూమర్స్ వస్తున్న సమయంలో ఈ న్యూస్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిస్తోంది. రోహిత్ నేరుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా దేశవాళీ, అనధికారిక మ్యాచ్ లు ఆడుకుంటే 2027 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత  వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు సమావేశమవుతారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ మీటింగ్ లో రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్ గా అయ్యర్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా రిపోర్ట్స్ తెలిపాయి.