
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ముంబైకి ఊహించని షాక్ ఇచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ముంబై తరపున సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరున్న రహానే తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం (ఆగస్టు 21) ప్రకటించారు. జట్టులో కొత్త కెప్టెన్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కెప్టెన్సీతో ఎన్నో విజయాలను అందించిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం ముంబై జట్టుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
"ముంబై జట్టుతో కలిసి కెప్టెన్‌గా ఉండటం, ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడం నాకు అతి పెద్ద గౌరవం. కొత్త డొమెస్టిక్ సీజన్ ముందు కొత్త నాయకుడిని తయారు చేసుకోవడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. అందుకే నేను కెప్టెన్సీ రోల్ లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మరిన్ని ట్రోఫీలు గెలవడానికి @MumbaiCricAssocతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను". అని రహానే ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
రహానే కెప్టెన్సీలో ముంబై 2023-24 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ముంబైకి ఇది తొలి టైటిల్ కావడం విశేషం. 2024-25 సీజన్‌లో ఆ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. కెప్టెన్‌గా గుడ్ బై చెప్పినప్పటికీ 37 ఏళ్ల రహానే రిటైర్మెంట్ తీసుకునే ఉద్దేశ్యం లేదని.. అన్ని ఫార్మాట్లలో బ్యాటర్ గా ముంబైకి తన సేవలను అందిస్తానని స్పష్టం చేశాడు. ముంబై జట్టులో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి అనుభవజ్ఞులైన కెప్టెన్లు ఉన్నారు.
►ALSO READ | Maharaja Trophy 2025: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: KKR ప్లేయర్ ఫైర్.. తొలి ఓవర్ మొదటి 4 బంతులకు సిక్సర్లు
జైస్వాల్, సర్ఫరాజ్ తప్పితే అయ్యర్, సూర్యకి అద్భుతమైన కెప్టెన్సీ రికార్డ్ ఉంది. అయ్యర్ మూడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సారధిగా ఉన్నాడు. సూర్యకుమార్ ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్. జైస్వాల్ రెగ్యులర్ గ లేటెస్ట్ క్రికెట్ ఆడుతుండడంతో అతనికే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025 ఐపీఎల్‌లో చివరిసారిగా రహానే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ చేశాడు. ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగాలనే తీసుకున్న నిర్ణయంతో, వచ్చే సీజన్‌కు కేకేఆర్ అతన్ని కెప్టెన్‌గా కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.