
ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (103) సెంచరీతో దుమ్ములేపాడు. తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఎంతో ఓపిగ్గా ఆడిన గిల్.. 228 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ టెస్ట్ కెరీర్ లో ఇది 9 వ సెంచరీ కాగా.. ఈ సిరీస్ లో నాలుగోది. ఓవరాల్ గా 238 బంతుల్లో 12 ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో గిల్ ఏకంగా డాన్ బ్రాడ్ మాన్, గవాస్కర్ ల సరసన చేరాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మూడో మూడవ కెప్టెన్‌గా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ ఘనత ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ టెస్ట్ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ (1947/48), టీమిండియా దిగ్గజ సునీల్ గవాస్కర్ (1978/79) మాత్రమే కెప్టెన్ గా ఒకే సిరీస్ లో నాలుగు సెంచరీలు కొట్టారు. తాజాగా గిల్ నాలుగు సెంచరీలతో వీరి రికార్డ్ సమం చేశాడు. ఈ సిరీస్ లో మరో టెస్ట్ ఉండడంతో చివరి టెస్టులో గిల్ సెంచరీ కొడితే ఒకే టెస్ట్ సిరీస్ లో ఐదు సెంచరీలు చేసిన తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టిస్తాడు.
ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో గిల్ 147 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్ బస్టన్ టెస్టులో ఈ టీమిండియా టెస్ట్ కెప్టెన్ విశ్వరూపమే చూపించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసి పలు రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేశాడు. తాజాగా మాంచెస్టర్ టెస్టులోనూ సెంచరీ కొట్టి ఈ సిరీస్ లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో గిల్ 722 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. \
►ALSO READ | IND vs ENG 2025: నిలబెట్టిన జడేజా, సుందర్: టీమిండియాకు ఆధిక్యం.. డ్రా దిశగా మాంచెస్టర్ టెస్ట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే చివరి రోజు టీ విరామ సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జడేజా (53), సుందర్ (58) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మరో 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు.. స్టోక్స్, ఆర్చర్ తలో వికెట్ తీసుకున్నారు. చివరి సెషన్ లలో ఇండియా 35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ కు 6 వికెట్లు తీస్తే మ్యాచ్ తో పాటు సిరీస్ గెలుచుకుంటుంది.
Shubman Gill in the list of Bradman and Gavaskar. 🔥 pic.twitter.com/Yg8PXmfcix
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2025