ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ లో అవకతవకలు జరిగాయంటూ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తప్పుగా ఇచ్చిన 22ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు కూడా లిస్టులో లేవని వారి పేర్లను వెంటనే జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవకతవకల్ని సరిదిద్దాలని అంటున్నారు. లేనిపక్షంలో డీజీపీ ఆఫీస్ ను ముట్టడిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.

మరోవైపు ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు అవకతవకలపై ఎన్ఎస్యూఐ డీజీపీకి ఫిర్యాదు చేసింది. కటాఫ్ మార్కుల్లో అవకతవకలు, తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన దృష్టికి తెచ్చారు. తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు కలపాలని కోరారు. క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల పేర్లను లిస్టులో పెట్టాలేదన్న విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రతి అభ్యర్థి మార్కుల లిస్టు రిలీజ్ చేయాలని, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ కోరింది.