రన్నింగ్లో క్వాలిఫై అయినోళ్లకు మెయిన్స్లో అవకాశం ఇయ్యాలె

రన్నింగ్లో క్వాలిఫై అయినోళ్లకు మెయిన్స్లో అవకాశం ఇయ్యాలె

రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్ ఈవెంట్స్లో తమకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్ల లాంగ్ జంప్ నిర్వహించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రన్నింగ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెయిన్స్లో అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయంపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని.. లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.