
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 11.
- పోస్టుల సంఖ్య: 76
- పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఏ (జనరల్) 50, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–బి (జనరల్) 11, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–బి(లీగల్) 8, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–బి(ఐటీ) 7.
- ఎలిజిబిలిటీ: కనీసం 60 శాతం మార్కులతో పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎస్/ సీఎఫ్ఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏకు 21 నుంచి 30 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-బికు 25 – 33 ఏండ్ల మధ్యలో ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జులై 14.
- లాస్ట్ డేట్: ఆగస్టు 11.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.1100.
- సెలెక్షన్ ప్రాసెస్: మూడంచెల విధానంలో ఎంపిక చేస్తారు. ఫేజ్–1లో ఆన్లైన్ ఆబ్జెక్టివ్ స్క్రీనింగ్ ఎగ్జామ్, ఫేజ్–2లో ఆన్లైన్ డిస్క్రిప్టివ్ అండ్ సబ్జెక్ట్ టెస్ట్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- పూర్తి వివరాలకు sidbi.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.
- ఫేజ్–1 ఎగ్జామ్: సెప్టెంబర్ 06
- ఫేజ్–2 ఎగ్జామ్: అక్టోబర్ 04.