కరీంనగర్ టౌన్,వెలుగు: ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ లో రాష్ట్ర స్థాయిలో సిటీలోని భగత్ నగర్ సిద్ధార్థ స్కూల్ స్టూడెంట్లు డి. హశ్విత్ కుమార్ 3వ స్థానంలో, కె. దివ్య 4వ స్థానంలో, ఎస్. హరిచందన 5వ స్థానంలో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాలను సాధించినట్లు చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
బుధవారం సిద్ధార్థ స్కూల్ లో నిర్వహించిన అభినందన సభలో రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులను చైర్మన్ శ్రీపాల్ రెడ్డి ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సమాజంలో ప్రతి విద్యార్థి ఇలాంటి పోటీపరీక్షలను తట్టుకుంటూ గొప్ప విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.
