మెదక్ జిల్లాలో యాప్ ద్వారా పక్కాగా యూరియా పంపిణీ : డీఏవో స్వరూప రాణి

మెదక్ జిల్లాలో  యాప్ ద్వారా పక్కాగా యూరియా పంపిణీ : డీఏవో స్వరూప రాణి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో బుకింగ్  యాప్‌‌‌‌  ద్వారా యూరియాను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు డీఏవో స్వరూప రాణి తెలిపారు. ఈ యాప్  ద్వారా రైతుల అవసరానికి అనుగుణంగా, సమయానికి యూరియా, ఎరువుల పంపిణీ జరుగుతోందని చెప్పారు. 9,187 మంది రైతులు యూరియా యాప్​ ద్వారా బుక్​ చేసుకొని 20,984 బస్తాలు కొనుగోలు చేశారని ఆమె తెలిపారు.

యూరియా బుకింగ్  యాప్  ద్వారా ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్  మార్కెటింగ్‌‌‌‌ను అరికట్టడంతో పాటు పంట అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ సాధ్యమవుతోందని తెలిపారు. కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.