సిద్దిపేట స్పోర్ట్స్ హబ్ దేశానికే ఆదర్శంగా నిలవాలి: మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట స్పోర్ట్స్ హబ్ దేశానికే ఆదర్శంగా నిలవాలి: మాజీ మంత్రి హరీశ్రావు

సిదిపేట, వెలుగు: ఇప్పటికే ఎడ్యుకేషన్, వాటర్ హబ్‌‌గా ఎదిగిన సిద్దిపేట.. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌‌గా దేశానికే ఆదర్శంగా నిలవడమే తన కల అని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఇండోర్ స్టేడియంలో అండర్-13, 15 బాలుర, బాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌ను ఆయన ప్రారంభించారు.

కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారుకావాలని పిలుపునిచ్చారు.

క్రీడా ప్రాంగణ అభివృద్ధి కోసం గతంలో రూ.11.50 కోట్లు మంజూరు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను నిలిపివేయడం బాధాకరమని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నర్సాపూర్, ఎర్ర చెరువు, జంక్షన్ల అభివృద్ధి, వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని సూచిస్తూ, మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న ఇంజినీర్, శానిటరీ ఇన్‌‌స్పెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పబ్లిక్ హెల్త్ ఈఎన్‌‌సీకి ఫోన్ చేసి కోరారు.