సీపీఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి

సీపీఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి

ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్ రూంలు కట్టివ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమి రామోజీ కబ్జా చేశారని ఆరోపించారు. పేదలకు ఆ భూముల చూపించాలని ఇండ్ల పట్టాదారులు, సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. 

ఇబ్రహీంపట్నం: 2007లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగాన్ పల్లి రెవెన్యూ గ్రామంలో 189, 203 సర్వే నంబరులో 18 ఏకరాల్లో 700 మందికి ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమయంలో పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం 189, 203 సర్వే నంబరులలో వున్న భూమికి రామోజీ రావు గేట్లు పెట్టి పేదలను లోపలకు రానివ్వడం లేదు. పేదల భూములు రామోజీ ఫిల్మ్ సిటీకి ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అడిగిందే తడవుగా 2017లో 295 ఏకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం పావులు కదిపింది. దీంతో 2007లో ఇండ్ల పట్టాలు పొందిన పేద కుటుంబాల ప్రజలు, సీపీఎం నాయకులు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో వున్న భూములను ముట్టడించారు. తమకు చూపించిన ఇండ్ల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోనివ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. లేనిచో ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పరచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాయాపోల్, నాగన్ పల్లి, పొల్కంపల్లి గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. సీపీఎం ధర్నాతో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.