నెల రోజుల్లో సింగరేణి హాస్పిటల్‌‌లో క్యాథ్ ల్యాబ్‌‌ సేవలు : సింగరేణి చీఫ్‌‌ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్‌‌ రాజ్‌‌కుమార్‌‌‌‌

నెల రోజుల్లో సింగరేణి హాస్పిటల్‌‌లో క్యాథ్ ల్యాబ్‌‌ సేవలు : సింగరేణి చీఫ్‌‌ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్‌‌ రాజ్‌‌కుమార్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌లో నెల రోజుల్లో గుండెకు సంబంధించిన క్యాథ్​ల్యాబ్​ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని సింగరేణి చీఫ్‌‌ మెడికల్​ఆఫీసర్ ​డాక్టర్​ కిరణ్‌‌రాజ్‌‌కుమార్‌‌‌‌ తెలిపారు. సోమవారం పలువురు డాక్టర్లతో కలిసి ఆయన క్యాథ్‌‌ల్యాబ్​సెంటర్‌‌‌‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

క్యాథ్​ల్యాబ్​ వైద్య సేవలు అందించడానికి పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌‌‌‌కు చెందిన రెనే హాస్పిటల్‌‌కు టెండర్ అలాట్ అయిందని తలిపారు. వారం రోజుల్లోగా విదేశాల నుంచి క్యాథ్‌‌ల్యాబ్‌‌ మిషన్లను తీసుకొచ్చి బిగించనున్నట్లు చెప్పారు. సీఎంవో వెంట డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్ రావు, రమేశ్‌‌, మద్దిలేటి, రెనే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్​ బంగారి స్వామి, తదితరులున్నారు.