2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

2030 నాటికి  100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
  • సింగరేణి  సీఎండీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ రాబోయే నాలుగేళ్లలో 100 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నదని ఆ సంస్థ సీఎండీ బలరామ్​ ప్రకటించారు. 2 వేల మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి, రాజస్థాన్​లో 1,500 మెగావాట్ల థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

హైదరాబాద్  సింగరేణి భవన్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో విజన్  డాక్యుమెంట్ 2047ను సీఎండీ విడుదల చేసి మాట్లాడారు. దేశ విదేశాల్లో ప్రవేశించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.  2030 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.