- సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం వెల్లడి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 1,3 గ్రూపు అండర్గ్రౌండ్మైన్ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం గనిని సందర్శించిన ఆయన కార్మికులను, ఉద్యోగులను అభినందించారు. జనవరిలో జీడీకే 1,3 గ్రూపు మైన్‌లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 656 టన్నులు కాగా 703 టన్నులు సాధించిందన్నారు. గనిలో నడుస్తున్న ఐదు ఎస్‌డీఎల్ యంత్రాలతో సగటున 150 టన్నుల ఉత్పత్తిని సాధించడం అభినందనీయమన్నారు.
జీడీకే 1 సీహెచ్‌పీలో జనవరి నాటికి 1,101 రేక్స్ ద్వారా బొగ్గు రవాణా చేసి గణనీయమైన వృద్ధి సాధించినట్టు జీఎం చెప్పారు. జనవరి 1న జీడీకే ఓపెన్ కాస్ట్5 ప్రాజెక్ట్‌లో ప్రొడక్షన్ డే నిర్వహించి మూడు షిప్టులలో 12,625 టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసి రికార్డు సృష్టించినట్టు జీఎం తెలిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆఫీసర్లు డి.రమేశ్, పి.రమేశ్, ఎల్.రమేశ్, జక్కుల సుధీర్, ఓదెలు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
