గోదావరిఖని, వెలుగు: కోల్ బెల్ట్‌లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని, బోర్లు వేసి వాటర్ సప్లై చేస్తామని సింగరేణి జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. గోదావరిఖనిలో రూ.14 కోట్లతో ఆర్ఎస్‌జీఎఫ్ ప్లాంట్ నిర్మించి క్లీన్ వాటర్ చాంబర్లు ఏర్పాటుచేయకపోవడంపై బుధవారం ‘వెలుగు’ పేపర్‌లో ‘కోల్‌బెల్ట్‌లో ఈ ఏడాదీ నీటికి కటకటే' అనే హెడ్డింగ్ వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం అధికారుల బృందంతో కలిసి గోదావరి ఒడ్డున పరిశీలించారు. వేసవి సమీపించడంతో సింగరేణి ఆర్జీ 1,2,3 ఏరియాల పరిధిలోని అడ్రియాల, సెంటినరీ కాలనీ, 8 ఇంక్లైన్ కాలనీ, విఠల్‌నగర్, గంగానగర్, చుట్టు పక్కల ప్రాంతాలకు నీటి సరఫరాపై రివ్యూ చేశారు.
మేడిపల్లి ఓపెన్కాస్ట్కందకం ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని గంగానగర్ ఫిల్టర్ బెడ్ వరకు పైప్లైన్ల ద్వారా తీసుకు వచ్చి అక్కడి నుంచి పంప్ చేస్తామని చెప్పారు. ఆయన వెంట అధికారులు కె.చంద్రశేఖర్, కెడిఎన్ వరప్రసాద్, ఎ.మల్లికార్జున్, గుర్తింపు సంఘం లీడర్మడ్డి ఎల్లయ్య, ఇతర ఆఫీసర్లు ఉన్నారు.
