పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి

పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి

సింగర్ చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని  ఆమె భర్త రాహుల్‌ రవీంద్రన్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘ద్రిప్త మరియు శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అని చిన్నారుల చేతులను పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా, సెలబ్రిటీలు, నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. కాగా మే 5, 2014న చెన్నైలో హిందూ సంప్రదాయ ప్రకారం చిన్మయి, రాహుల్‌ వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి పేరు పొందగా, నటుడిగా, దర్శకుడిగా రాహుల్‌ స్ధిరపడ్డాడు.