కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేయాలి

కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేయాలి

సింగర్ సునీత కొడుకు ఆకాష్​ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా గంగనమోని శేఖర్ డైరెక్షన్ చేస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్‌‌‌‌. రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం  హైదరాబాద్‌‌‌‌లో  వేడుకను నిర్వహించారు. 

ఈ సందర్భంగా ‘సర్కారు నౌకరి’ టీజర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. నిర్మాతలు సురేష్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ పాల్గొని రాఘవేంద్రరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  రాఘవేంద్రరావు మాట్లాడుతూ  ‘కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేసేందుకే ఆర్కే టెలీ ఫిలింస్ స్టార్ట్  చేశాను. 

మాతో 25 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్న టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కొత్త టాలెంట్​ను ఎంకరేజ్​ చేయాలి’అన్నారు.  సునీత మాట్లాడుతూ -‘రాఘవేంద్రరావు గారి  బ్యానర్​లో మా అబ్బాయి హీరోగా లాంచ్ అవడం ఆనందంగా’ ఉంది అని చెప్పారు. హీరో హీరోయిన్, రైటర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు శాండిల్య, సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.