94 ఏళ్ల వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సులో మెగాఫోన్ పడుతున్న సింగీతం.. నిర్మాతగా నాగ్ అశ్విన్

94  ఏళ్ల వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సులో మెగాఫోన్ పడుతున్న సింగీతం.. నిర్మాతగా నాగ్ అశ్విన్

పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రాల దర్శకులు సింగీతం శ్రీనివాసరావు.. 94 ఏళ్ల వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సులో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఆయనకిది 61వ సినిమా. శనివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

 వైజయంతి మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు. త్వరలోనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.