- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు, బీఎల్‌ఏలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం బల్మూరు మండలం గోదల్ గ్రామంలో పార్టీ ముఖ్య నేతలు బీఎల్‌ఏలతో రివ్యూ చేశారు.
సర్ ప్రక్రియ నమోదుకు ఆగస్టు 3వరకు పొడిగించారని, ప్రతి ఓటరును మ్యాపింగ్ చేయాలన్నారు. ఇప్పటివరకు కొన్ని గ్రామాల్లో 80 శాతం ఓటర్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు చెప్పారన్నారు. ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లినా, సాంకేతిక లోపాలు ఉన్నా వాటిని వెంటనే సరిదిద్దాలన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాంప్రసాద్ గౌడ్, సర్పంచ్ ఇందిరమ్మ, ఉప సర్పంచ్ పధిర శ్రీదేవి, లీడర్లు ఖదీర్, నసీర్, సలేశ్వరం, బాలరాజు, అల్వాల్ రెడ్డి, శేఖర్, సజ్జు, మొహిద్, తదితరులు పాల్గొన్నారు.
