
దుబాయ్: ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్టు) అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపెట్టిన సిరాజ్ చివరి నిమిషాల్లో మూడు వికెట్లు తీశాడు. ఫలితంగా ఇండియా 6 రన్స్ స్వల్ప తేడాతో గెలిచి సిరీస్‌ను 2–2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు.
‘ఐసీసీ అవార్డుకు ఎంపిక కావడం చాలా ప్రత్యేకమైన గౌరవం. అండర్సన్–టెండూల్కర్ సిరీస్ ఎంతో స్పెషల్. నేను పాల్గొన్న అత్యంత తీవ్రమైన పోటీల్లో ఒకటి. ముఖ్యంగా నిర్ణయాత్మక సమయాల్లో నేను అద్భుతమైన స్పెల్స్ వేసినందుకు గర్వపడుతున్నా. వాళ్ల దేశంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది’ అని సిరాజ్ పేర్కొన్నాడు. విమెన్స్ కేటగిరీలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా
ప్రెండర్ గాస్ట్‌కు ఈ పురస్కారం దక్కింది.