సికింద్రాబాద్, వెలుగు: అన్నకు బోన్ మ్యారో(ఎముక మజ్జ) దానం చేసి ప్రాణాలు కాపాడింది ఓ చిన్నారి చెల్లి. వివరాల్లోకి వెళ్తే... ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశానికి చెందిన దంపతులు.. తమ14 ఏండ్ల కుమారుడు అనారోగ్యానికి గురవడంతో మెరుగైన వైద్యం కోసం వచ్చి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
బాలుడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సికిల్సెల్వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బోన్‌మ్యారో మార్పిడి చేసేందుకు తల్లిదండ్రులది మ్యాచ్ కాలేదు. బాలుడి ఏడేండ్ల చెల్లి బోన్‌మ్యారో మ్యాచ్అయ్యింది. చిన్నారి తన అన్నకు బోన్‌మ్యారో ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకు వచ్చింది. దీంతో డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
