ఎలక్టోరల్‌‌ బాండ్ల కోసం బ్లాక్మెయిల్‌‌ చేశారా.?..కేటీఆర్‌‌‌‌పై సిట్ ప్రశ్నల వర్షం

ఎలక్టోరల్‌‌ బాండ్ల కోసం బ్లాక్మెయిల్‌‌ చేశారా.?..కేటీఆర్‌‌‌‌పై సిట్ ప్రశ్నల వర్షం
  • ఫోన్​ ట్యాపింగ్ ​లిస్టులో ఉన్నోళ్ల నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి?
  • 230కిపైగా ఫోన్‌‌ నంబర్లు చూపి కేటీఆర్‌‌‌‌పై సిట్​ ప్రశ్నల వర్షం.. దాదాపు 7 గంటలు విచారణ
  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడంపైనా ఆరా 
  • సంధ్యా శ్రీధర్ రావును బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆధారాలు చూపిన సిట్
  • తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్‌‌ రావును పిలిపించి వివరాల సేకరణ! 
  • మునుగోడు బైపోల్స్, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్​ ఆపరేషన్లపైనా ఆరా
  • కేవలం కాంగ్రెస్, బీజేపీ నేతల డబ్బు మాత్రమే ఎందుకు పట్టుబడిందని ప్రశ్న​

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా వ్యాపారవేత్తల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున అందిన విరాళాలతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన ఎలక్టోరల్‌‌ బాండ్లపై ఆరా తీసింది. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఫోన్ ​ట్యాపింగ్​ లిస్టులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. 

ఎలక్టోరల్‌‌ బాండ్ల కోసం  పోలీసులతో గానీ పార్టీ శ్రేణులతో గానీ బెదిరింపులకు, బ్లాక్‌‌మెయిలింగ్‌‌కు పాల్పడ్డారా? అనే కోణంలో వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్‌‌ శ్రీధర్ రావు బ్లాక్‌‌ మెయిలింగ్‌‌కు సంబంధించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. దీంతోపాటు మునుగోడు బైపోల్స్, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పోల్​మేనేజ్‌‌మెంట్​గురించి, కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా జరిగిన -సెర్చ్​ఆపరేషన్లపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు సిట్​అధికారులు కేటీఆర్‌‌‌‌ను సుమారు ఏడు గంటల పాటు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌‌‌‌కు సిట్‌‌ గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10.45 గంటలకు హరీశ్‌‌రావు, కొందరు బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లతో కలిసి కేటీఆర్‌‌‌‌ జూబ్లీహిల్స్ పీఎస్‌‌కు వచ్చారు.  ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌‌రావును పోలీసులు అడ్డుకొని కేటీఆర్​ఒక్కరినే లోపలికి అనుమతించారు.

ఫోన్‌‌ నంబర్లు ముందు పెట్టి ప్రశ్నలు.. 

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి సహా నలుగురు సభ్యుల సిట్‌‌ బృందం కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించింది. ఫోన్‌‌ ట్యాపింగ్  కేసులో ఇప్పటికే సేకరించిన ఫోన్ నంబర్లతో పాటు సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌ రావు స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా పలు అంశాలపై ఆరా తీసింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ లిస్టులోంచి సేకరించిన సుమారు 230కి పైగా నంబర్లను కేటీఆర్‌‌‌‌ ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వీటిలో సుమారు 30 వరకు ఎలక్టోరల్​ బాండ్స్​ ఇచ్చినవారి ఫోన్ ​నంబర్లు ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులకు చెందిన కొన్ని నంబర్లు, పేర్లు మినహా చాలా నంబర్లు ఎవరివో తన కు తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కేటీ ఆర్‌‌‌‌కు చూపిన ఫోన్ నంబర్లలో సీఎం రేవంత్‌‌ సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్‌‌ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రత్యర్థుల కదలికలను ఇంటెలిజెన్స్‌‌ ద్వారా తెలుసుకునే వీలున్నప్పటికీ ఫోన్‌‌ట్యాపింగ్‌‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే, పోలీసులు చేసే పనుల గురించి తనను అడిగితే ఏం లాభం అం టూ కేటీఆర్‌‌‌‌ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రణీత్‌‌రావు, రాధాకిషన్‌‌రావు ఇచ్చిన స్టేట్‌‌మెంట్ల ఆధారంగా పలు అంశాలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కోసం ఎస్‌‌ఐబీకి మెటీరియల్‌‌ సమకూర్చిన ‘కన్వర్జెన్స్‌‌ ఇన్నోవేషన్‌‌ ల్యాబ్‌‌’ గురించి, అత్యాధునిక సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లు కొనుగోలు చేసేందుకు ఫండ్స్​ఇచ్చిన ఓ ఎమ్మెల్సీ గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను కేటీఆర్‌‌‌‌కు చూపినట్లు తెలిసింది.

ఎలక్టోరల్ బాండ్లపై ఫోకస్ 

విచారణలో భాగంగా కేటీఆర్‌‌‌‌ను బీఆర్ఎస్​ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌‌కు జాతీయ పార్టీలకు దీటుగా వందల కోట్ల ఎలక్టోరల్​బాండ్లు ఎలా వచ్చాయి? గుర్తు తెలియని వ్యక్తులు కూడా కోట్లు పెట్టి, ఎలక్టోరల్‌‌ బాండ్లు ఎందుకు కొనుగోలు చేశారు? భారీ విరాళాల కోసం ఎవరినైనా బెదిరించారా? బ్లాక్‌‌మెయిలింగ్‌‌కు పాల్పడ్డారా? అని సిట్​ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలక్టోరల్​బాండ్ల కోసం తామెవరినీ బెదిరించలేదని, అంతా నిబంధనల ప్రకారమే వచ్చాయని, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులు తమ ఆఫీసులో ఉన్నాయని కేటీఆర్​చెప్పినట్లు సమాచారం. దీంతో సిట్​అధికారులు ఎలక్టోరల్​బాండ్లు కొనుగోలు చేసిన సుమారు 30 దాకా ఫోన్​నంబర్లను ట్యాప్​చేసినట్లు ఉన్న ఆధారాలను కేటీఆర్​ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిపై నిఘా ఎందుకు పెట్టారు? వారి ఫోన్​నంబర్లను ఎందుకు ట్యాప్​చేశారు? అని ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్‌‌ శ్రీధర్‌‌‌‌రావును బ్లాక్​మెయిల్​చేసి, రూ.13 కోట్ల బాండ్లు కొనిపించినట్లు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపి మరోసారి ప్రశ్నించగా.. కేటీఆర్​ సమాధానం దాటవేసినట్లు తెలిసింది. దీంతో రాధాకిషన్‌‌ రావును సిట్‌‌ కార్యాలయానికి పిలిపించి, సంధ్యా కన్వెన్షన్​వ్యవహారంపై వివరాలు సేకరించినట్లు సమాచారం. 

బీఆర్‌‌‌‌ఎస్ మినహా అన్ని పార్టీల డబ్బు పట్టుకున్నారు కదా..

ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలు, 2023 అసెం బ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించి సిట్​అధికారులు కేటీఆర్‌‌‌‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది. హైదరాబాద్‌‌లో టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు చేసిన సెర్చ్‌‌ ఆపరేషన్లలో బీఆర్‌‌‌‌ఎస్ కాకుండా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బు మాత్రమే పట్టుబడడానికి గల కారణాలేమిటని అడిగినట్లు సమాచారం. కేసులో నిందితులు ప్రణీత్‌‌ రావు, సంతోష్‌‌ రావు, రాధాకిషన్ రావు మధ్య జరిగిన సంభాషణల కాల్‌‌డేటాను కేటీఆర్‌‌‌‌కు చూపినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురు వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్‌‌ నంబర్లను కూడా ట్యాప్‌‌ చేసిన ఆధారాలను కేటీఆర్‌‌‌‌కు చూపగా, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అప్పటి పోలీస్​అధికారుల నుంచే వివరాలు తీసుకోవాలని కేటీఆర్ బదులిచ్చినట్లు సమాచారం.

నేను హోంమంత్రిని కాదు: కేటీఆర్‌‌‌‌

ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఎస్‌‌ఐబీ చీఫ్‌‌గా నియమించ డం గురించి సిట్‌‌ అధికారులు అడుగ్గా.. ‘‘నేను హోంమంత్రిని కాదు.. నాకు సంబంధం లేని విషయం ఎందుకు అడుగుతున్నారు?’’ అని కేటీఆర్‌‌‌‌ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అప్ప ట్లో ఎంఏయూడీ సహా నాలుగు డిపార్ట్‌‌మెంట్లకే తాను మంత్రిగా ఉన్నానని, తన శాఖ కావడం తో ఫార్మూలా–ఈ రేసు కేసులో ఏసీబీ విచార ణకు పిలిస్తే వెళ్లానని, ప్రభాకర్ రావు నియామ కం సహా ఇతర విష యాలు అప్పటి హోంశాఖ పరిధిలోని అంశాలని, దీనికి తనకు సంబంధం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సిట్​ఆఫీసర్లకు కేటీఆర్ సూచించినట్టు తెలిసింది. 

అవసరమైతే మళ్లీ పిలుస్తం.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు, ప్రముఖులు సహా వేలాది మంది ఫోన్లను చట్టవిరుద్ధంగా ఇంటర్‌‌సెప్ట్ చేసి నిఘా పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్​ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు దర్యాప్తును తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చట్టప్రకారం, దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నాం. సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయవద్దని కేటీఆర్‌‌‌‌కు సూచించాం. అవసరమైతే ఆయన మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. - వీసీ సజ్జనార్‌‌‌‌, హైదరాబాద్‌‌ సీపీ, సిట్‌‌ చీఫ్‌‌