- 2023 ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతున్నది. దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు శనివారం రికార్డ్ చేశారు. తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అనిల్‌కుమార్ సైతం శనివారం మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులను కలిసి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, వీరిద్దరి ఫోన్ నంబర్లను 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఆయా ఫోన్ నంబర్లను వినియోగించింది ఎవరు.. ఎన్నికలు, ఇతర సందర్భాల్లో తలెత్తిన అనుమానాస్పద ఘటనలకు సంబంధించి మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఇద్దరి వద్ద దాదాపు 40 నిమిషాల పాటు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిసింది.
