విద్యా శాఖ కీలక నిర్ణయం.. స్పెషల్ ఆఫీసర్లతో సర్కారు బడుల తనిఖీ

విద్యా శాఖ కీలక నిర్ణయం.. స్పెషల్ ఆఫీసర్లతో సర్కారు బడుల తనిఖీ
  • 17 మందిని నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు
  • విద్యా శాఖ కార్యక్రమాలపై నిరంతర నిఘా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో చదువుల తీరును పర్యవేక్షించేందుకు 17 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. 2026-27 విద్యాసంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నియామకాలు జరిపినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్టులను విద్యాశాఖ సెక్రటరీకి సమర్పించాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దడం, గడువులోగా టెర్గెట్​రీచ్ అవడం ఈ అధికారుల ప్రధాన బాధ్యత అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విద్యా శాఖ ఆఫీసర్లు తమకు కేటాయించిన జిల్లాల్లో నిరంతరం పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో విద్యా కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలి. ప్రధానంగా బడుల్లో పిల్లల చేరిక, జీరో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ స్కూళ్ల పరిస్థితి, మధ్యాహ్న భోజన పథకం, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలుతీరు, పాఠ్యపుస్తకాల పంపిణీ ఎలా ఉందో తెలుసుకోవాలి.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న సివిల్ వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా వీరు స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కాగా అమలు చేయాలని భావిస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్, డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఔట్స్ గుర్తింపు, ఫౌండేషనల్ లిటరసీ వంటి 19 కీలక అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ ఇనిషియేటివ్స్ పిల్లలకు ఏ మేరకు చేరుతున్నాయో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. 

జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు వీరే..
హైదరాబాద్ (ఎం.రాధారెడ్డి), మేడ్చల్ మల్కాజిగిరి (రమణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సంగారెడ్డి (జి.రమేశ్)​, రంగారెడ్డి (కె.లింగయ్య), మహబూబాబాద్ (విజయలక్ష్మీబాయి), యాదాద్రి భువనగిరి (సత్యనారాయణారెడ్డి), వికారాబాద్, నారాయణపేట (ఎం. సోమిరెడ్డి), భూపాలపల్లి (శ్రీనివాస్ రెడ్డి), ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి (పి.రాజీవ్), ఖమ్మం, భద్రాద్రి, వరంగల్(మదన్ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ (ఏ.ఉషారాణి), జనగామ, సూర్యాపేట, నల్గొండ (బి. వెంకటనర్సమ్మ), నిర్మల్, ఆదిలాబాద్, సిరిసిల్ల (నాంపల్లి రాజేశ్), ములుగు, హనుమకొండ (జనార్దన్ రావు), కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట (రేవతిరెడ్డి), గద్వాల, నాగర్ కర్నూల్ (మీరాజుల్లాఖాన్).

మరిన్ని వార్తలు