హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు కేసీఆర్ ఫామ్ హౌస్కు బయల్దేరినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ శుక్రవారం ఉండనున్నట్లు తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన ఫామ్ హౌస్లోనే విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సన్నిహితులను, కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
