యుద్ధం నేపథ్యంలో ప్రేమకథ.. 'సీతా రామం'

యుద్ధం నేపథ్యంలో ప్రేమకథ.. 'సీతా రామం'

'సీతా రామం' టీజర్ విడుదలైంది. ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ నటించారు.  మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా,  రష్మిక మందన కీలక పాత్ర పోషించారు. యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ దీన్ని  నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ శనివారం  గ్రాండ్ గా జరిగింది. ఇందులో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.  నిమిషం 14 సెకన్ల నిడివిగల 'సీతా రామం'  టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది.  ''లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అనే వాయిస్.. దాన్ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా ఉన్నాయి. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్న వెంటనే నిండు సంప్రదాయంగా సీత పాత్ర రివీల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది.  పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచ్చింగ్ గా ఉంది.  ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. ''సీతా రామం'' తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వండర్ ఫుల్ గా సినిమా 

టీజర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. 'సీతా రామం' టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా ఉండబోతుంది.  'సీతా రామం' మెమరబుల్ మూవీ. అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది.  దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.  సీతా రామం' కథ గొప్పగా వుంటుంది. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుంది'' అని అన్నారు. 

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. 

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు వండర్ ఫుల్ ఎక్సపిరియన్స్ ఇవ్వడానికే వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్ సల్మాన్  ని లెఫ్టినెంట్ రామ్ పాత్రలో ఇంకా ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణం సపోర్ట్ గా నిలిచినా దుల్కర్ , నిర్మాత స్వప్న గారికి ధన్యవాదాలు. చాలా వైవిధ్యమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. మైనస్ 24 డిగ్రీల వద్ద కూడా షూట్ చేశాం, ఇది దుల్కర్, స్వప్న  గారి సపోర్ట్ వల్లే సాధ్యపడింది'' అన్నారు.  సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం చాలా అద్భుతమైన టీమ్ పని చేసింది. ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. దుల్కర్, స్వప్న, హను గారితో పని చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు. 

మీడియా ప్రశ్నలకు సమాధానాలు.. 

మహానటితో ఒక మార్క్ సెట్ చేశారు. సీతారామంతో ఒక నటుడిగా ఎలాంటి మార్కులు పడతాయని భావిస్తున్నారు ?

దుల్కర్ : వైజయంతి మూవీస్ పై నాకు అపారమైన నమ్మకం ఉంది. దర్శకుడు హను ఈ కథని చెప్పినపుడు ఎపిక్ లవ్ స్టొరీ అనిపించింది. నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్ చేస్తే నేను హ్యాపీ.  

హను రాఘవపూడితో పని చేయడం ఎలా అనిపించింది ? 

దుల్కర్ : హను రాఘవపూడి ఎనర్జిటిక్ డైరెక్టర్. ఆయనకి పని తప్ప మరో ధ్యాస లేదు. చుట్టుపక్కల ఏమున్నాయో కూడా చూసుకోరు. తన ఫోకస్ అంతా సినిమాపైనే ఉంటుంది. నేను 35పైగా సినిమాలు చేసుంటాను. హను మాత్రం చాలా ప్రత్యేకం. 

'సీతారామం'లో  పాన్ ఇండియా స్థాయిలో ఉండే విలక్షణమైన అంశాలు ఏమిటి ?

హను రాఘవపూడి: అందరికీ కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ సీతారామం. గ్రేట్ లవ్ స్టొరీ. ఇందులో ఉండే ప్రాసెస్ అంతా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ఇది మ్యాజికల్ లవ్ స్టొరీ. చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. 

మహానటి ఎపిక్ హిట్ అయ్యింది కదా ? మళ్ళీ దుల్కర్ తో చేస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి ? 

స్వప్న దత్: మహానటిలో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న జెమినీ గణేశన్ పాత్రని దుల్కర్ అద్భుతంగా చేశారు. దుల్కర్ కి మా మీద నమ్మకం ఎక్కువ. ఆయనకు కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. అలా ఆచితూచి ఎంపిక చేసుకున్న తర్వాత ఈ కథని దుల్కర్ కి పంపించా. ఆయన ఓకే చెప్పారు. ఆయన నమ్మకం మాకు ఇంకా బాధ్యతను పెంచుతుంది. తనకు మరో సూపర్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. 

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు 

దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వినీదత్ 
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్ 
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో : వంశీ-శేఖర్