‘మహా వీరుడు’.. రిలీజ్‌‌‌‌కి రెడీ

‘మహా వీరుడు’.. రిలీజ్‌‌‌‌కి రెడీ

డాక్టర్, డాన్‌‌‌‌, ప్రిన్స్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శివ కార్తికేయన్. ఇప్పడు ‘మహా వీరుడు’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మడోన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ను ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో శివ కార్తికేయన్ యాక్షన్ మోడ్‌‌‌‌లో కనిపించనున్నాడు. అదితి శంకర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  శాంతి టాకీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు.  భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు శివ కార్తికేయన్ నటించిన ‘అయాలాన్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు శివ.