
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలంలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు కూలీలకు విద్యుత్ షాక్ కొట్టి మరణించారు. ఈ విషాద ఘటన లంకెవాని దిబ్బలో చోటుచేసుకుంది. చెరువు వద్ద ఒడిషాకు చెందిన రాంమ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్‌లు పనిచేస్తున్నారు. వీరంతా గురువారం పడుకున్న సమయంలో.. కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. దాంతో స్పాట్‌లోనే ఆరుగురు చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.