ఆరో రోజు… అలిగిన బతుకమ్మ

ఆరో రోజు… అలిగిన  బతుకమ్మ

ఆశ్వయుజ మాసంలో తెలంగాణ ఆడపడుచులంతా కలిసి తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ బతుకమ్మ. ఆ సంబరాల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’ అంటారు.ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అందుకే పూలతో బతుకమ్మను తయారీ చేయరు. గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు.

కానీ ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని, ఇంటి ముందు పాటలతో బతుకమ్మ ఆడుతూ ప్రార్థిస్తారు.  పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో.. అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందట. అందువల్లే ఆరో రోజు బతుకమ్మను పేర్చడం, నైవేద్యం పెట్టడం ఉండదు అంటారు పెద్దలు.