ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

 ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా... 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. మరోకరి పరిస్ధితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోల్తాపడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బలవంతంగా స్థానికులు బయటకు తీశారు. ఘటనా స్ధలానికి చెరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులు హైదరాబాద్ కు చెందిన  లక్ష్మీ(13), గోవర్ధిని(8)గా గుర్తించారు.   బస్సు డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో వేగంగా నడపడంతో కోడుమూరు-ప్యాలకుర్తి మధ్య ప్రమాదం జరిగింది.