కోల్‌కతా: టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్ విజయాల ఖాతా తెరిచింది. వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేసిన ఇటలీపై 73 రన్స్ తేడాతో గెలిచింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో జార్జ్ మున్సీ (54 బాల్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 84) దంచికొట్టడంతో తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది.
బ్రాండన్ మెక్‌ములెన్ (41 నాటౌట్), మైఖేల్ జోన్స్ (37), మైఖేల్ లీస్క్ (22 నాటౌట్) కూడా రాణించారు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇటలీ 16.4 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. బెన్ మునెంటి (52), హ్యారీ మొనెంటి (37) పోరాడారు. స్కాటిష్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
