
సోలో హీరోగా చేస్తూనే.. ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ధనుష్ హీరోగా దర్శకుడిగా రూపొందిస్తున్న ‘రాయన్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ధనుష్‌పై ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 24న సెకెండ్ సింగిల్ రాబోతోందని తెలియజేస్తూ.. ఏ.ఆర్.రెహమాన్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఇందులో సందీప్ కిషన్.. అపర్ణ బాలమురళీని సైకిల్ ఎక్కించుకుని తొక్కుతున్న పోస్టర్ ఆకట్టుకుంది. రెహమాన్ మ్యూజిక్‌లో తన సాంగ్ రావడం బ్లెస్సింగ్ అంటూ సందీప్ కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నార్త్ మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాలో నిత్యామీనన్, అనిఖా సురేంద్రన్ హీరోయిన్స్. కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా జూన్ 13న విడుదల కానుంది.